ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-10-26T04:46:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని మైదుకూరు నియోజకవర్గ టీటీడీ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు.

టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్
దువ్వూరు, అక్టోబరు 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని మైదుకూరు నియోజకవర్గ టీటీడీ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం చింతకుంట గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాలపై అల్లరి మూకలతో దాడి చేయిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి రాయలసీమలో అయితే ఖూనీలు చేస్తామని మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల వెంకటకొండారెడ్డి, దువ్వూరు, చాపాడు, బి.మఠం మండల కన్వీనర్లు బోరెడ్డి వెంకటరమణారెడి ్డ, అన్నవరం సుధాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.