9 నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-02-07T04:37:38+05:30 IST
ఎంసెట్ (బైపీసీ) పాసై ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఫార్మశీ కళాశాలలో అడ్మిషన్ల కొరకు ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ఈనెల 9వతేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కో-ఆర్డినేటర్ టీవీ కిష్ణ్రమూర్తి తెలిపారు.

కడప (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 6 : ఎంసెట్ (బైపీసీ) పాసై ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఫార్మశీ కళాశాలలో అడ్మిషన్ల కొరకు ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ఈనెల 9వతేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కో-ఆర్డినేటర్ టీవీ కిష్ణ్రమూర్తి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ప్రాసెసింగ్ రుసుం ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ప్రాసెసింగ్ రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 లు 8వ తేదీ నుంచి చెల్లించాలన్నారు. ప్రాసెసింగ్ రుసుం క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలన్నారు. చెల్లించిన వెంటనే తమ మొబైల్ నెంబరుకు లాగిన్ ఐడీ, ఐసీఆర్ ఫారం నెంబరు వస్తుందని, వాటితో పది నుంచి 12వ తేదీలోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు ప్రాసెసింగ్ రుసుం చెల్లించి వెరిఫికేషన్ కాని వారు, నాన్ ఎలిజబుల్ అని వచ్చిన వారు మాత్రమే హెల్ప్‌లైన్ సెంటరుకు షెడ్యూలు ప్రకారం 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రావాల్సి ఉంటుందన్నారు. స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పీహెచ్, క్యాప్, ఆంగ్లోఇండియన్ విద్యార్థులు కౌన్సెలింగ్ కొరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు షెడ్యూలు ప్రకారం వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
రేపు డిప్లమో స్పాట్ అడ్మిషన్
కడప (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 6 : ఈ సంవ త్సరం ప్రత్యేక పరీక్షల దృష్ట్యా రెండోసారి డిప్లమో స్పాట్ అడ్మిషన్లు జరిపేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్ అనుమతిచ్చారు. పదో తరగతి అర్హత కల అభ్యర్థులు డిప్లమో ఇంజనీరింగ్ కోర్సు చేసేందుకు సోమవారం కడప నగరం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ క్రిష్ణమూర్తి తెలిపారు. కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీల వివరాలిలా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ 3, ఎలకా్ట్రనిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 6, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ ఇంజనీరింగ్ 15 ఖాళీలున్నాయన్నారు. అడ్మిషన్ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ప్రధానంగా పదో తరగతి మార్క్స్ మెమో, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఈడబ్ల్యు సర్టిఫికెట్, టీసీ, ఫొటోలు, ఆధార్ కార్డుతో పాటు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.6300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5700 రూపాయలు తీసుకుని ప్రభుత్వ మహిళా పాలిటె క్నిక్ కళాశాలలో సంప్రదించాలన్నారు.