989 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-05-21T05:43:24+05:30 IST
జిల్లాలో 989 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటినలో తెలిపింది. దీంతో మొత్తం 87,214 పాజిటివ్ కేసులకు చేరుకుంది. ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య 595కి చేరింది.

ఇద్దరి మృతి
కడప, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 989 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటినలో తెలిపింది. దీంతో మొత్తం 87,214 పాజిటివ్ కేసులకు చేరుకుంది. ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య 595కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 1447 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 77,669కి చేరింది. 6800 మంది హోం ఐసోలేషనలో, 2006 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజుపాలెంలో 25 టె స్టులు నిర్వహించగా 20 మంది పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయింది.. పాజిటివ్ రేటు 80గా నమోదై ఉంది. మైలవరంలో 45 మందికి టెస్టులు చేస్తే 26, 55.32 పాజిటివ్ రేటు, బి.కోడూరులో 45 మందికి గాను 21 మందికి ఇక్కడ 44.68, కొండాపురంలో 56 మందికి టెస్టులు చేస్తే 23, ఇక్కడ 41.07గా పాజిటివ్ రేటు ఉంది.
49 మండలాల్లో..
కడపలో 123, కోడూరు 58, ప్రొద్దుటూరు 55, ఎర్రగుంట్ల 45, ఓబులవారిపల్లె 45, ప్రొద్దుటూరు అర్బన 42, బద్వేలు 31, కమలాపురం 30, పులివెందుల 29, పోరుమామిళ్ల 27, రాయచోటి 27, ఎర్రగుంట్ల 27, మైలవరం 26, పెనగలూరు 25, కొండాపురం 23, బి.మఠం 22, ఖాజీపేట 22, అట్లూరు 21, బి.కోడూరు 21, రాజంపేట రూరల్ 21, రాజుపాలెంలో 20, వల్లూరు 20, జమ్మలమడుగు 20, వీఎనపల్లె 19, ముద్దనూరు 19, దువ్వూరులో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే పెద్దముడియంలో 18, రాజంపేట అర్బన 17, నందలూరు 16, మైదుకూరు 14, చింతకొమ్మదిన్నె 14, టి.సుండుపల్లె 14, సిద్దవటం 13, పుల్లంపేట 13, ఒంటిమిట్ట 12, జమ్మలమడుగు 11, చెన్నూరు 10, సింహాద్రిపురం 10, చిట్వేలి 10, మైదుకూరు 9, బద్వేలు 8, రామాపురం 7, తొండూరు 7, కాశినాయన 6, వేంపల్లె 6, వేముల 6, రాయచోటి 6, కలసపాడు 5, లింగాల 5, గాలివీడు 4, లక్కిరెడ్డిపల్లె 3, చాపాడు 3, పులివెందుల రూరల్ 2, చిన్నమండెం 2, వీరబల్లె 2, చక్రాయపేట 1, పెండ్లిమర్రి 1 కేసులు నమోదయ్యాయి.