89 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-07-25T05:14:43+05:30 IST

జిల్లాలో మరో 89 మందిలో కరోనాపాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

89 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 89 మందిలో కరోనాపాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న 149 మందిని డిశ్చార్జి చేశారు. ఆసుపత్రుల్లో 212 మంది, హోం ఐసోలేషన్‌లో 418 మంది చికిత్స పొందుతున్నారు. సరాసరి పాజిటివ్‌ రేటు 1.9 గా నమోదైంది. ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం 1,09,801 మంది కరోనా బారిన పడగా 688 మంది మృతిచెందారు. 1,08,362 మంది కోలుకున్నారు. శనివారం అత్యధికంగా నందలూరులో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడప, పుల్లంపేట, కోడూరులో 12 చొప్పున, మిగతా చోట్ల పదిలోపు నమోదయ్యాయి. 

Updated Date - 2021-07-25T05:14:43+05:30 IST