59 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-08-11T05:15:30+05:30 IST

జిల్లాలో 59 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

59 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 59 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం కేసులు 1,11,383కి చేరాయి. ఇప్పటి వరకు 697 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 14 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 1,09,977కు చేరింది. ఆసుపత్రుల్లో 172, హోం ఐసోలేషన్‌లో 425 మంది చికిత్ప పొందుతున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. కడపలో 15, రాజంపేటలో 14 కేసులు నమోదు కాగా మిగతా చోట్ల ఐదు లోపు నమోదయ్యాయి. 

Updated Date - 2021-08-11T05:15:30+05:30 IST