57 చీనీ చెట్లు నరికివేత

ABN , First Publish Date - 2021-05-31T04:25:59+05:30 IST

మండల పరిధి చింతకుంట గ్రామానికి చెందిన సానె చిన్నగుర్రప్ప(ప్రసాద్‌) అనే వ్యక్తికి చెందిన 57 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.

57 చీనీ చెట్లు నరికివేత
నరికివేసిన చీనీ చెట్లను పరిశీలిస్తున్న సీఐ

ముద్దనూరు, మే 30 : మండల పరిధి చింతకుంట గ్రామానికి చెందిన సానె చిన్నగుర్రప్ప(ప్రసాద్‌) అనే వ్యక్తికి చెందిన 57 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... సానె చిన్నగుర్రప్పకు చింతకుంట గ్రామ సమీపంలో 5 ఎకరాల పొలంలో 600 చీనీ చెట్లు ఉన్నాయి. శనివారం సాయంత్రం చెట్లకు నీళ్ళు వదిలి ఇంటికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారు జూమున   చెట్లు నరికి ఉన్నాయి. ఈ సమాచారాన్ని పక్కనున్న పొలం రైతులు చిన్నగుర్రప్పకు తెలిపారు. వెంటనే పొలం వద్దకు వెళ్లి చూడగా దాదాపు 57 చెట్లు నరికి ఉన్నాయి. వాటికి రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. డీఎస్పీ నాగరాజు, సీఐ హరినాథ్‌ చెట్లను పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-05-31T04:25:59+05:30 IST