హోంగార్డు పోస్టులకు 406 మంది హాజరు

ABN , First Publish Date - 2021-05-09T04:33:30+05:30 IST

జిల్లాలో బి.కేటగిరీ హోంగార్డు శానిటేషన్‌ పోస్టులకు 183, గార్డెనర్‌ పోస్టులకు శనివారం 223 మంది హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

హోంగార్డు పోస్టులకు 406 మంది హాజరు

కడప (క్రైం), మే 8: జిల్లాలో బి.కేటగిరీ హోంగార్డు శానిటేషన్‌ పోస్టులకు 183, గార్డెనర్‌ పోస్టులకు శనివారం 223 మంది హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత, ప్రతిభ ఆధారంగానే నిబంధనల మేరకు ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. 

ఇసుక అక్రమ రవాణా, అక్రమమద్యంపై మెరుపు దాడులు

జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, సారా తయారీ ప్రాంతాల్లో శనివారం మెరుపు దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 5.62 లీటర్ల దేశీ అక్రమ మద్యంతో పాటు ఒక వాహనం స్వాఽధీనం చేసుకున్నామన్నారు. రెండు కేసులు నమోదు చేసి వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం, ఇసుక రవాణా చేస్తే డయల్‌ 100కు సమాచారం అందించాలని అన్నారు. 

Updated Date - 2021-05-09T04:33:30+05:30 IST