29 వార్డులు... 34 పోలింగ్‌ స్టేషన్లు

ABN , First Publish Date - 2021-10-21T04:51:32+05:30 IST

రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించిన పోలింగ్‌ స్టేషన్‌ లిస్ట్‌లను కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు.

29 వార్డులు... 34 పోలింగ్‌ స్టేషన్లు
పోలింగ్‌స్టేషన్ల లిస్టును ఆవిష్కరిస్తున్న కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి

రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్ల ప్రకటన

రాజంపేట టౌన్‌, అక్టోబరు 20 : రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించిన పోలింగ్‌ స్టేషన్‌ లిస్ట్‌లను కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో రాజంపేట పురపాలక సంఘంలోని 29 వార్డులకు సంబంధించిన డ్రా్‌ఫ్ట్‌ 34 పోలింగ్‌స్టేషన్ల లిస్టును కలెక్టర్‌ ఆమోదించారని పేర్కొంటూ ఆ ముసాయిదాను ఆవిష్కరించారు. అన్ని రాజకీయ పార్టీలకు ప్రజల కొరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ లిస్టును అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. డ్రాఫ్ట్‌ పోలింగ్‌స్టేషన్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల రాజంపేట కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు.

Updated Date - 2021-10-21T04:51:32+05:30 IST