2 పాజిటివ్‌ కేసులు..!

ABN , First Publish Date - 2021-10-20T05:13:38+05:30 IST

జిల్లాలో మరో ఇద్దరిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నాగరాజు మంగళవారం ఒక ప్రకటలో వెల్లడించారు.

2 పాజిటివ్‌ కేసులు..!

కడప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో ఇద్దరిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నాగరాజు మంగళవారం ఒక ప్రకటలో వెల్లడించారు. కడపలో 1, ప్రొద్దుటూరులో 1 కేసు నమోదైంది. సోమవారం 51 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జనం ఆందోళన చెందారు. అయితే మరుసటి రోజు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చింది. ఆస్పత్రిలో 65 మంది, హోం ఐసోలేషన్‌లో 109 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న 14 మందిని డిశ్చార్జ్‌ చేశారు.  జిల్లాలో ఇప్పటి వరకు 1,15,638 మంది కరోనా బారిన పడగా, 714 మంది మృతిచెందారు. కరోనా నుంచి 1,14,660 మంది కోలుకున్నారు.

 

Updated Date - 2021-10-20T05:13:38+05:30 IST