తొలిరోజు పరీక్షలకు 1519 మంది హాజరు

ABN , First Publish Date - 2021-01-21T04:52:07+05:30 IST

కడప జిల్లా బి.కేటగిరి హోంగార్డుల ఎత్తు అర్హత పరీక్షలకు మొదటిరోజైన బుధవారం 2 వేల మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా 1519 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

తొలిరోజు పరీక్షలకు 1519 మంది హాజరు
అభ్యర్థుల ఎత్తు కొలుస్తున్న దృశ్యం

ప్రతిభ ఆఽధారంగానే ఎంపిక : ఎస్పీ అన్బురాజన్‌ 


కడప (క్రైం), జనవరి 20 : కడప జిల్లా బి.కేటగిరి హోంగార్డుల ఎత్తు అర్హత పరీక్షలకు మొదటిరోజైన బుధవారం 2 వేల మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా 1519 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.  జనరల్‌ మహిళా అభ్యర్థులు ఎత్తు 150, ఎస్టీ మహిళా అభ్యర్థులు 145 సెం.మీ కలిగి ఉండాలన్నారు. పురుష జనరల్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఎత్తును 160 సెం.మీలకు సవరించామన్నారు. మొదటిరోజు ఎత్తు పరీక్షకు గైర్హాజరైన 481 మంది అభ్యర్థులు తిరిగి 21, 22, 23, 24 తేదీల్లో హాజరు కావాలని తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందన్నారు.

Updated Date - 2021-01-21T04:52:07+05:30 IST