1178 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-09T04:47:09+05:30 IST

24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 1178 కేసులు నమోదయ్యాయి.

1178 పాజిటివ్‌ కేసులు నమోదు

ఐదుగురి మృతి


కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒకరోజు శాంతించినట్లు కనిపించి మళ్లీ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 1178 కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్‌ కేసులు చూస్తే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ భారీ ఎత్తున పెరిగేటట్లు కనిపిస్తోంది. మొత్తం కేసులు 70,822కు చేరాయి. కరోనా మహమ్మారి మరో ఐదుగురిని కాటేసింది. దీంతో ఇప్పటి వరకు 570 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రిలో కోలుకున్న 792 మందిని డిశ్చార్జి చేశారు. మొత్తం రికవరీ సంఖ్య 63,611కు చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు, కేర్‌ సెంటర్లలో 1985 మంది చికిత్స పొందుతుండగా హోం ఐసోలేషన్‌లో 4663 మంది చికిత్స తీసుకుంటున్నారు. మండలాల వారీగా కేసుల వివరాలు పరిశీలిస్తే..  జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడపలో 232 కేసులు, ఓబులవారిపల్లెలో 95, రైల్వేకోడూరు 87,  పులివెందుల 72, రాజంపేట 62, ఒంటిమిట్ట 62, రాయచోటి 43, ప్రొద్దుటూరు 34, చిట్వేలి 31, పెనగలూరు 28, ఎర్రగుంట్ల 27, వీరబల్లె 25, ఎల్‌ఆర్‌పల్లె 24, ఖాజీపేట 22, సంబేపల్లె 19, పుల్లంపేట 19, బద్వేలులో 19, సింహాద్రిపురం 17, జమ్మలమడుగు 16, కొండాపురం 15, బి.కోడూరు 15, నందలూరు 13, కమలాపురం 13, గోపవరం 13, సిద్దవటం 12, వేంపల్లె 12, రామాపురం 11,  టి.సుండుపల్లె 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే సీకేదిన్నె 11,  లింగాల 11, బి.మఠం 10, వేముల 10, వల్లూరు 9, పెద్దముడియం 9, ముద్దనూరు 7, ఎస్‌ఏకెఎన్‌ 7, అట్లూరు 7, తొండూరు 6, వీఎన్‌పల్లె 6, మైదుకూరు 6, చిన్నమండెం 5, పెండ్లిమర్రి 5, దువ్వూరు 3, గాలివీడు 3,  కలసపాడు 3, పోరుమామిళ్ల 2, రాజుపాలెం 2, చెన్నూరు 2, చాపాడు 2, మైలవరం 1, చక్రాయపేట 1, అదర్‌ డిస్ట్రిక్ట్‌ 1 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-05-09T04:47:09+05:30 IST