రిక‘వర్రీ’..?

ABN , First Publish Date - 2021-08-10T09:59:49+05:30 IST

జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన కార్యాలయం పరిధిలోని కడప అర్బన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ సబ్‌ రిజిసా్ట్రర్ల పరిధిలో రోజుకు 100-150కి పైగానే వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషనలు జరుగుతున్నాయి.

రిక‘వర్రీ’..?
కడప రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

నకిలీ చలానాల కుంభకోణంలో రూ.1.08 కోట్లు స్వాహా

రికవరీపై 15 రోజుల్లో తేల్చాలని ఐజీ ఆదేశాలు

తలలు పట్టుకున్న రిజిస్ట్రేషన అధికారులు

రిజిస్ట్రేషనలు రద్దు చేసే అవకాశం..?

స్టాంపు రైటర్ల ద్వారా వసూలుకు సన్నాహాలు

ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులపై వేటు

రాష్ట్రంలో కలకలం రేపిన రిజిస్ట్రేషన నకి‘లీలలు’


రిజిస్ట్రేషన శాఖలో నకిలీ చలానాల కుంభకోణంలో రూ.1.08 కోట్లు స్వాహా చేశారని అధికారులు నిగ్గు తేల్చారు. ఆ సొమ్ము ఎలా రికవరీ చేయాలి..? 15 రోజుల్లో రికవరీలపై తేల్చాలని ఆ శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. కుంభకోణానికి ప్రధాన కారకుడైన డాక్యుమెంట్‌ రైటర్‌ నుంచి రాబట్టాలా..? నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన చేసిన దసా్త్రలు రద్దు చేయాలా..? ఆ దస్తావేజుదారులకు నోటీసులు జారీ చేసి వసూలు చేయాలా..? స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన అధికారులను వేధిస్తున్న ప్రశ్నలివి. రికవరీపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు సబ్‌ రిజిసా్ట్రర్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లను ఇప్పటికే సస్పెన్షన చేసిన సంగతి తెలిసిందే. ఆ వివరాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన కార్యాలయం పరిధిలోని కడప అర్బన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ సబ్‌ రిజిసా్ట్రర్ల పరిధిలో రోజుకు 100-150కి పైగానే వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషనలు జరుగుతున్నాయి. సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎ్‌ఫఎంఎ్‌స)లో ఉన్న లోపాలను అసరా చేసుకుని ఈ కుంభకోణానికి తెగబడ్డారు. స్థిరాస్తులు, దాన సెటిల్మెంట్‌ (గిఫ్ట్‌ డీడ్‌).. వంటివి రిజిస్ట్రేషన చేస్తే ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలి. సీఎ్‌ఫఎంఎస్‌ విధానం వచ్చాక.. సీఎ్‌ఫఎంఎస్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆనలైనలో డబ్బులు చెల్లించి ప్రింట్‌ను తీయాలి. ఆ చలానా ప్రింట్‌ను సబ్‌ రిజిసా్ట్రర్‌కు ఇస్తే.. చలానా నెంబరును ఆనలైనలో చెక్‌ చేసుకుని ఆమోదించాలి. సబ్‌ రిజిసా్ట్రర్‌ దగ్గరున్న కంప్యూటర్‌లో చలానా నెంబరు కనిపిస్తుందే తప్ప ఎంత డబ్బు చెల్లించారనేది కనిపించదు. ఈ లోపాన్ని గుర్తించిన కడపకు చెందిన స్టాంప్‌ రైటర్‌ రామకృష్ణ స్టాంపు డ్యూటీ రూ.1, రూ.100, రూ.1,000 ఇలా అతి తక్కువ చెల్లించి.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా అదే నెంబరుతో పూర్తి స్టాంప్‌ డ్యూటీ అమౌంట్‌కు నకిలీ చలానాలు సృష్టించి ఖజానాకు కన్నం వేశాడు.కడప అర్బన సబ్‌ రిజిసా్ట్రర్‌ సుబ్బారెడ్డి పరిశీలనలో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. 


రూ.1.08 కోట్లు స్వాహా

నకిలీ చలానాల కుంభకోణం రిజిస్ట్రేషన శాఖలో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ శాఖ ఐజీ స్పందించి కడప అర్బన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో జనవరి నుంచి కుంభకోణం వెలుగు చేసిన రోజు వరకు స్టాంప్‌ రైటరు రామకృష్ణ రిజిస్ట్రేషన చేయించిన డాక్యుమెంట్లను ఆడిట్‌ సిబ్బంది 5, 6వ తేదీల్లో సమగ్ర తనిఖీలు చేశారు. దాదాపుగా 3 వేలకు పైగా డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. అర్బన సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం-1, 2 పరిధిలో 102 డాక్యుమెంట్లు, 310 చలానాల లోపాలను గుర్తించారు. నకిలీ చలానాల ద్వారా రూ.46,89,938, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం పరిధిలో 143 డాక్యుమెంట్లు, 505 నకిలీ చలానాల ద్వారా రూ.61,84,595లు స్వాహా చేశారు. మొత్తంగా రూ.815 నకిలీ చలానాలతో రూ.1.08 కోట్లు స్వాహా చేశారని ఆడిట్‌ సిబ్బంది నిగ్గు తేల్చారు. ఆ నివేదికను కలెక్టరు, రిజిస్ట్రేషన శాఖ ఐజీ, డీఐజీలకు జిల్లా రిజిసా్ట్రరు పంపారు. ఈ నివేదిక ఆధారంగా అర్బన సబ్‌ రిజిసా్ట్రర్లు సుబ్బారెడ్డి, చంద్రమోహన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ హరికృష్ణలతో పాటు జూనియర్‌ అసిస్టెంట్లను డీఐజీ గిరిబాబు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసింది. 


ఆ సొమ్ము రికవరీపై తేల్చండి

స్వాహా చేసిన రూ.1.08 కోట్ల రికవరీపై 15 రోజుల్లోగా తేల్చాలని రిజిస్ట్రేషన ఐజీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్టాంపు రైటర్‌ రామకృష్ణపై రిమ్స్‌ పోలీస్‌స్టేషనలో కేసు నమోదు చేశారు. స్వాహా చేసిన నగదు ఎలా రికవరీ చేయాలన్నది జిల్లా అధికారులను వేధిస్తున్న ప్రశ్న. స్టాంపు రైటరే నకిలీ చలానాలు సృష్టించాడని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా ఆయన నుంచి రాబట్టాలా..? నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన జరిగిన డాక్యుమెంట్లను రద్దు చేయాలా..? లేదంటే డాక్యుమెంట్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి రికవరీ చేయాలా..? అనేది పలు కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన విధానంపై అవగాహన లేక స్టాంపు రైటర్లను ఆశ్రయిస్తే.. నకిలీ చలానాలతో మేము కట్టిన స్టాంపు డ్యూటీ డబ్బు స్వాహా చేశారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన రద్దు చేస్తే.. మా పరిస్థితి ఏమిటి..? జనవరిలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ భారీగా పెరిగింది.. ఎవరో చేసిన తప్పుకు రిజిస్ట్రేషన రద్దు చేసి.. మళ్లీ చేయించుకోవాలంటే అమ్మకందారులు ముందుకు వస్తారా..? వారు రాకపోతే న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రిజిస్ట్రేషన చేయించుకున్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి డాక్యుమెంట్‌కు నకిలీ చలానాలు వినియోగించారో తెలుసుకోవడానికి స్టాంప్‌ రైటర్‌ రామకృష్ణ ద్వారా రిజిస్ట్రేషన చేయించుకున్న వారు రిజిసా్ట్రర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


మూడు రోజులుగా ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు

అర్బన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసుల్లో నకిలీ చలానాల కుంభకోణంపై విచారణ నేపధ్యంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ఆగిపోయాయి. ఎప్పటి నుంచి మొదలుపెడతారో స్పష్టత లేదు. ముగ్గురు సబ్‌ రిజిసా్ట్రర్లు సస్పెండ్‌ కావడంతో వారి స్థానంలో కొత్త వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా రిజిసా్ట్రరు ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఏఎండీ ప్రసాద్‌ను కడప అర్బన-1 సబ్‌ రిజిసా్ట్రర్‌గా, ముద్దనూరు సబ్‌ రిజిసా్ట్రర్‌ కృష్ణకిశోర్‌కు అర్బన-2 ఇనచార్జి సబ్‌ రిజిసా్ట్రర్‌గా, జిల్లా రిజిసా్ట్రరు ఆఫీసు ఎంవీ అండ్‌ ఆడిట్‌ సబ్‌ రిజిసా్ట్రరు శ్యామలాదేవిని ఇనచార్జి రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌గా నియమించారు. కమలాపురంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌రెడ్డిని ముద్దనూరు ఇనచార్జి సబ్‌ రిజిసా్ట్రరుగా నియమించారు. వీరంతా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. వీరికి డిజిటల్‌ కీ ఇంకా రాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని అంటున్నారు. అయితే.. రోజుకు సుమారు వందకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన ఆగిపోయింది.


రికవరీకి ప్రణాళిక రూపొందిస్తున్నాం 

- చెన్నకేశవరెడ్డి, జిల్లా రిజిసా్ట్రర్‌, కడప

అర్బన, రూరల్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల ద్వారా రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించాం. ఆ మొత్తం రికవరీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధికారులు ఆదేశించిన మాట వాస్తవమే. ఎలా రికవరీ చేయాలో ప్రణాళిక తయారు చేస్తున్నాం. నకిలీ చలానాల ద్వారా రిజిస్ట్రేషన చేసిన డాక్యుమెంట్లు రద్దు చేయాలా..? డాక్యుమెంట్‌దారులకు నోటీసులు ఇవ్వాలా..? రికవరీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. 

Updated Date - 2021-08-10T09:59:49+05:30 IST