చిన్నారులకు పురుగు పట్టిన చిక్కీలు

ABN , First Publish Date - 2021-06-22T06:28:10+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు పౌష్ఠికాహారం పేరుతో అందిస్తున్న చిక్కీలలో పురుగులు దర్శనమిస్తున్నాయి.

చిన్నారులకు పురుగు పట్టిన చిక్కీలు
చిక్కీలలో తిరుగుతున్న పురుగులు

ప్రత్తిపాడు, జూన్‌ 21: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు పౌష్ఠికాహారం పేరుతో అందిస్తున్న చిక్కీలలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన చిక్కీలను చిన్నారులకు పంపిణీ చేయడం వలన అందులో పురుగులు పైకి తిరుగుతూ కనిపిస్తున్నాయి. ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు కందిపప్పుతో పాటు చిక్కీలను కూడా  పంపిణీ చేశారు. అవి మొత్తం పురుగులు పడివున్నాయి. ఇవేమి గమనించని కొందరు చిన్నారులు వాటిని అక్కడే తినేయగా, కొందరు విద్యార్థులు గమనించి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో  చిక్కి పేకెట్లు పరిశీలించి చూడగా అందులో ముక్క పురుగులు తిరుగుతూ కనిపించడంతో పాటు కొంచెం వాసన కూడా వస్తున్నాయి. చిక్కీలు పాఠశాలలు మూసివేసిన ఏప్రిల్‌ 20 తరువాత పంపిణీ చేయాల్సివుంది. అయితే, ఇక్కడ ఉపాధ్యాయులు ప్రస్తుతం వచ్చిన కందిపప్పుతోపాటు వీటిని పంపిణీచేశారు. అయితే అప్పుడు నిల్వ ఉన్న కోడిగుడ్లు, బియ్యం ఏమయ్యాయో మరి. 


Updated Date - 2021-06-22T06:28:10+05:30 IST