వైఎస్‌ పథకాలను తుంగలో తొక్కుతోన్న జగన్‌

ABN , First Publish Date - 2021-09-03T06:04:38+05:30 IST

వైఎస్‌ వారసుడుగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ ఆయన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కేలా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి ధ్వజమెత్తారు.

వైఎస్‌ పథకాలను తుంగలో తొక్కుతోన్న జగన్‌
వైఎస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మస్తాన్‌వలి, లింగంశెట్టి తదితరులు

గుంటూరు, సెప్టెంబరు 2: వైఎస్‌ వారసుడుగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ ఆయన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కేలా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి పురస్కరించుకొని గురువారం రాజీవ్‌గాంధీభవన్‌లో  వైఎస్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతూ మాటతప్పను మడమ తిప్పనంటూ జగన్‌ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఏపీసీసీ ప్రఽధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి అడవి ఆంజనేయులు, నాయకులు బొట్ల బ్రహ్మం, గడ్డం పాల్‌ విజయ్‌కుమార్‌, ఎండీ ఉస్మాన్‌, కరీం, సుభాని, భాగ్యరాజ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T06:04:38+05:30 IST