ప్రజల గుండెల్లో సజీవంగా వైఎస్‌ఆర్
ABN , First Publish Date - 2021-09-03T17:31:26+05:30 IST
కోట్లాదిమంది తెలుగు ప్రజల గుండెల్లో..

ఎమ్మెల్యే రజిని
చిలకలూరిపేట: కోట్లాదిమంది తెలుగు ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కొలువై ఉన్నారని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం, శాఖాగ్రంథాలయం సెంటర్, పోలిరెడ్డిపాలెం వైఎస్‌ఆర్ కాలనీ, కమ్మవారిపాలెం గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రజిని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అన్నదానం కార్యక్రమాలు ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ ఫీజ్ రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫి, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఇందిరమ్మ ఇల్లు ఇలా ఎన్నో పథకాలను వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమాలలో మునిసిపల్ చైర్‌పర్సన్ షేక్ రఫాని, వైస్‌చైర్మన్‌లు కొలిశెట్టి శ్రీనివాసరావు, వలేటి వెంకటేశ్వరరావు, యార్డుచైర్మన్ బొల్లెద్దు చిన్నా, వైసీపీ నాయకులు మల్లెల రాజేష్‌నాయుడు, విడదల గోపి, పఠాన్ తలహాఖాన్, దేవినేని శంకరరావు, గొంటు శ్రీనివాసరెడ్డి, కల్లూరి బుజ్జి, దరియావలి, తోట బ్రహ్మస్వాములు, గౌతమ్‌రెడ్డి, కాట్రు రమేష్, బండారు వీరయ్య, అల్లీమియా, కౌన్సిలర్‌లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో..
నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ ఇన్‌ఛార్జి ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ నాయకులు జాష్టి నాగాంజనేయులు, కోటటపాటి ఏడుకొండలు, చెవుల ఆంజనేయులు, టి లీలాకిషోర్, దార్ల రాజు, మర్రి భాస్కరరావు, పొనుగుబాటి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. పసుమర్రు గ్రామంలో 15, 16 వార్డుల కౌన్సిలర్‌లు జాలాది సుబ్బారావు, షేక్ మస్తాన్‌వలిలు జడ్పీ పాఠశాల ఎదురుగా ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
నాదెండ్ల: మండలంలోని పలు గ్రామాలలో గురువారం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పించారు. గణపవరం, నాదెండ్ల, సాతులూరు, కనపర్రు, గొరిజవోలు, తూబాడు తదితర గ్రామాలలోని వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మునిసిపల్ వైస్‌చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, నాయకులు సుందరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు కాట్రు రమేష్, కోటిరెడ్డి, సర్పంచ్ పెరుమాళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.