ఘనంగా ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T06:41:08+05:30 IST

ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రైల్‌ వికాస్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం
రైల్‌ వికాస్‌ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న డీఆర్‌ఎం మోహన్‌రాజా, అధికారులు, సిబ్బంది

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రైల్‌ వికాస్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు యోగ గురు జగదీష్‌ రైల్వే అధికారులు, సిబ్బందితో యోగాసనాలు ప్రాక్టీసు చేయించారు. యోగా వలన అనేక ప్రయోజనాలున్నాయని జగదీష్‌ వ్యాఖ్యానించారు. ఊపిరితిత్తులు సామర్థ్యం పెంచే అనేక విధానాలు యోగాలో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరి నిత్య జీవితంలో యోగా భాగం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా, అదనపు డీఆర్‌ఎం(ఇన్‌ఫ్రా) ఆర్‌.శ్రీనివాస్‌, సీనియర్‌ డీసీఎం డి.నరేంద్రవర్మ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-22T06:41:08+05:30 IST