సీఎంపై దుర్భాషలాడితే సహించం

ABN , First Publish Date - 2021-10-22T05:12:08+05:30 IST

సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై మరోసారి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే సహించేదిలేది లేదని వైసీపీ నేతలు హెచ్చరించారు.

సీఎంపై దుర్భాషలాడితే సహించం
సభలో ప్రసంగిస్తున్న ఎంపీ మోపిదేవి, వేదికపై మేయర్‌ కావటి, ఎమ్మెల్యేలు గిరిధర్‌, ముస్తఫా, ఏసురత్నం తదితరులు

జనాగ్రహ దీక్షలో వైసీపీ నేతలు

గుంటూరు, అక్టోబరు 21: సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై మరోసారి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే సహించేదిలేది లేదని  వైసీపీ నేతలు హెచ్చరించారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మార్కెట్‌ సెంటర్‌లో గురువారం వైసీపీ నేతలు మండేపూడి పురుషోత్తం, ఓర్సు శ్రీనివాసరావు, జగన్‌ కోటి జనాగ్రహ దీక్ష పేరుతో 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగనకు వస్తోన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అలజడులు సృష్టించాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు తామెన్నడూ చూడలేదని, టీడీపీ నేతలను ప్రజలే వెంటపడికొడతారన్నారు. మేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఎండీ ముస్తఫా మాట్లాడుతూ వెంటనే టీడీపీ నేతలు సీఎం జగన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, నగర డిప్యూటీ మేయర్లు డైమండ్‌బాబు, షేక్‌ సజీల,   కార్పొరేటర్లు, పార్టీ డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.  నల్లపాడు సెంటర్‌లోని వైసీపీ నేతలు జనాగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల సుబ్బారావు, మెట్టు వెంకటప్పారెడ్డి, పిల్లి మేరి, నాగేశ్వరరావు, సూర్యప్రకాశరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-10-22T05:12:08+05:30 IST