పోలేరమ్మ ఉత్సవాల్లో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-02-07T05:23:13+05:30 IST

గోరంట్ల ఆలయాల నిర్వహణలో కొన్నాళ్లుగా ముదురుతున్న విబేధాలు శుక్రవారం రాత్రి పతాకస్థాయికి చేరాయి.

పోలేరమ్మ ఉత్సవాల్లో వైసీపీ నేతల దౌర్జన్యం

పోలీస్‌ ఆదేశాలతో అన్నదాన కార్యక్రమం నిలిపివేత

గుంటూరు(సంగడిగుంట), ఫిబ్రవరి6: గోరంట్ల ఆలయాల నిర్వహణలో కొన్నాళ్లుగా ముదురుతున్న విబేధాలు శుక్రవారం రాత్రి పతాకస్థాయికి చేరాయి. స్థానికంగా ఉన్న పోలేరమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త యర్రంశెట్టి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. శనివారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే శనివారం తెల్లవారుజామున కొందరు వైసీపీ నేతలు ఆలయ ప్రాంగణం వద్దకు వచ్చి అన్నదాన ఏర్పాట్లను నిలిపివేయాలని కోరారు. ఎందుకు, ఏమిటి అని అడుగగా చెప్పాల్సిన అవసరం లేదంటూ వంటపాత్రలను చిందరవందరగా చేశారు. విషయం తెలుసుకున్న సీఐ నల్లపాడు వీరాస్వామి ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వివాదం ముదిరేలా కనబడటంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఎన్నోఏళ్లుగా పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతలు పెత్తనం చేయాలని చూడటంతోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు శనివారం వాపోయారు.

Updated Date - 2021-02-07T05:23:13+05:30 IST