పెచ్చుమీరుతున్న వైసీపీ ఆగడాలు

ABN , First Publish Date - 2021-11-28T05:33:03+05:30 IST

పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

పెచ్చుమీరుతున్న వైసీపీ ఆగడాలు

యరపతినేని శ్రీనివాసరావు

గుంటూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. పల్నాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రోజుకో దాడి జరుగుతుందన్నారు. ఫ్యాక్షన రాజకీయాల్లో ఏడుగురిని హత్య చేశారని తెలిపారు. 80మందికి పైగా నాయకులపై దాడులు జరిగాయన్నారు. అక్రమమైనింగ్‌ తవ్వకాల్లో భాగంగా ఏడుగురు పసిపిల్లలు గుంతల్లో పడి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని.. కాళ్లూ, చేతులు విరగ్గొట్టడం, చంపటం చేస్తున్నారని ఆరోపించారు. వారి ఆస్తులను ధ్వంసం చేయటం కూడా నిరంతర ప్రక్రియగా మారిందన్నారు. ఓ పక్క అల్లా, అల్లా అని వేడుకుంటున్నప్పటికీ టీడీపీ కార్యకర్త సైదాను కొడుతున్న దృశ్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చూశారన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. నేడు అధికారం మీదైతే.. రేపు మాదవుతుందన్న సంగతి వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రధానంగా కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌, అంబటి రాంబాబులు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఏఏ ఇబ్బందులు పెట్టారో అవన్ని వైసీపీ నేతలు భవిష్యత్తులో పడాల్సి వస్తుందని యరపతినేని అన్నారు. 

Updated Date - 2021-11-28T05:33:03+05:30 IST