ప్రభుత్వ భూముల్లో వైసీపీ నేతల పాగా

ABN , First Publish Date - 2021-05-30T05:55:12+05:30 IST

గురజాల నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను తెలుగుదేశం ప్రభుత్వం నాడు కాపాడితే నేడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకోవడంతో పాటు మట్టిని విక్రయించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. దాచేపల్లి మండలం పొందుగుల గ్రామ శివారులో 150 ఎకరాల ప్రభుత్వ భూమిని భవిష్యత్‌లో ఏవైనా పరిశ్రమలకు, కళాశాలల ఏర్పాటుకు, ప్రభుత్వ అవసరాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం కాపాడిందన్నారు. ఇప్పుడు ఆ భూములన్నీ అధికార పార్టీకి చెం

ప్రభుత్వ భూముల్లో వైసీపీ నేతల పాగా

అధికారులు మొద్దు నిద్ర పోతున్నారు..

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ధ్వజం


పిడుగురాళ్ల, మే29: గురజాల నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను తెలుగుదేశం ప్రభుత్వం నాడు కాపాడితే నేడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకోవడంతో పాటు మట్టిని విక్రయించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. దాచేపల్లి మండలం పొందుగుల గ్రామ శివారులో 150 ఎకరాల ప్రభుత్వ భూమిని భవిష్యత్‌లో ఏవైనా పరిశ్రమలకు, కళాశాలల ఏర్పాటుకు, ప్రభుత్వ అవసరాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం కాపాడిందన్నారు. ఇప్పుడు ఆ భూములన్నీ అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. దైద గ్రామంలో వందెకరాల భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకొని ఆ భూముల్లో మట్టిని తరలిస్తున్నారని, అదే విధంగా మాడుగుల గ్రామంలోనూ వందెకరాల భూమిని ఆక్రమించి ప్రైవేటు గోడౌన్‌ కట్టుకొని గ్రావెల్‌ తరలించేస్తున్నారన్నారు. ఇంతజరుగుతున్నా రెవెన్యూ అధికారుల మౌనం వెనుక అర్థమేమిటో ప్రజలందరికీ తెలియాలన్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారంలో ఎమ్మెల్యే కాసుమహేష్‌రెడ్డి పాత్ర ఉందో లేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పాత్ర లేకుంటే వెంటనే వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న భూములను ఖాళీ చేయించి వాటిలో హెచ్చరిక బోర్డులు పెట్టించాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా మైనింగ్‌, బ్లాస్టింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంచినట్లయితే   పరిశ్రమలు, విద్య, వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, వైసీపీ నాయకుల అరాచక త్వానికి అవన్నీ ఆక్రమణకు గురైతే భవిష్యత్‌ ఏ ఒక్క పరిశ్రమ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వశాఖాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకొని పొందుగుల సమీపంలో ఆక్రమణలకు గురవుతున్న 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించి కాపాడాల్సిందిగా యరపతినేని  అధికారులను కోరారు. 

Updated Date - 2021-05-30T05:55:12+05:30 IST