రైతుల ఉద్యమం చరిత్రాత్మకం

ABN , First Publish Date - 2021-05-02T05:40:06+05:30 IST

అమరావతి కోసం 500 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం చరిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రైతుల ఉద్యమం చరిత్రాత్మకం

 యరపతినేని 

పిడుగురాళ్ల, మే1: అమరావతి కోసం 500 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం చరిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతి అనేది ఓ ప్రాంతానికో, ఒక వర్గానికో సంబంధించిన అంశం కాదని ఐదు కోట్ల మంది ఆధ్రుల రాజధాని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైపోయిందని ఆరోపించారు.  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష, తెలుగుదేశం నాయకులను టార్గెట్‌చేసి తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేయటం, జైలుకు పంపించటం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఆర్థికంగా, మానసికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ దురాగతాలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. తనకు అలవాటైన జైలుకు మిగిలిన వారందరిని కూడా పంపించాలనుకోవటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయపార్టీ కూడా ఇంతటి కక్షపూరితంగా వ్యవహరించలేదన్నారు. కొవిడ్‌తో వేలాదిమంది ఆక్సిజన్‌ కూడా అందని స్థితిలో చనిపోతుంటే జగన్‌ తాడేపల్లి నుంచి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. పరీక్షలకు సిద్ధమవడం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడడమే అని అన్నారు. దాచేపల్లి మండలంలో జేపీ సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతపడి సంవత్సరం పైనే అవుతున్నా వేలాదిమంది  కార్మికులు రోడ్డునపడ్డా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్మిక వర్గానికి యరపతినేని మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2021-05-02T05:40:06+05:30 IST