వీఆర్‌వోలకు జీతాలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-01-12T05:40:19+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులకు తక్షణమే పెండింగ్‌ జీతాలను విడుదల చేయాలని వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

వీఆర్‌వోలకు జీతాలు విడుదల చేయాలి
ఖజాన శాఖ డీడీ రాజగోపాల్‌కి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌

అసోసియేషన్‌ నేత సూరేపల్లి రాజశేఖర్‌ విజ్ఞప్తి

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ అధికారులకు తక్షణమే పెండింగ్‌ జీతాలను విడుదల చేయాలని వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని జిల్లా ఖజాన శాఖ కార్యాలయంలో ఆయన డిప్యూటీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు వీఆర్‌వోలకు జీతాలు చెల్లించడం లేదన్నారు.  దీని వలన వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 


Updated Date - 2021-01-12T05:40:19+05:30 IST