విజ్ఞాన్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-12T05:33:36+05:30 IST

స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

విజ్ఞాన్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
గోరింటాకు పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు

గుంటూరు(విద్య), జనవరి 11: స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. డిబేట్‌, క్విజ్‌, గోరింటాకు డిజైనింగ్‌, గాలిపటాలు ఎగురవేయడం  తదితర పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T05:33:36+05:30 IST