దీక్షిత.. సామాజిక సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-02-05T06:02:12+05:30 IST

సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి దీక్షిత ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సేవలు అందించడం ప్రశంసనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

దీక్షిత.. సామాజిక సేవలు అభినందనీయం
కన్నాకు చెక్కు అందజేస్తున్న నిర్వాహకులు

గుంటూరు(సంగడిగుంట), ఫిబ్రవరి 4: సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి దీక్షిత ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సేవలు అందించడం ప్రశంసనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అయోధ్యలోని భవ్య రామమందిర నిర్మాణానికి దీక్షిత ఫౌండేషన్‌, చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.లక్ష అందజేసింది. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు యడ్లపల్లి ఉషా, శ్రీకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, దుస్తులు, నోటు పుస్తకాలు అందించడంతో పాటు వృద్ధాశ్రమాలలో దుస్తులు, దుప్పట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆలోచనా వేదిక అధ్యక్షుడు మేడూరు రాజేంద్రప్రసాద్‌, న్యాయవాది నిమ్మకాయల సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఈదర శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-05T06:02:12+05:30 IST