సేవా కార్యక్రమాలకు అనుమతివ్వాలి

ABN , First Publish Date - 2021-05-30T05:58:13+05:30 IST

ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా శివశక్తి లీలా అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆపలేరని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. సేవా కార్యక్రమాలకు అధికారులు అనుమతించాలంటూ శనివారం ఆయన కార్యకర్తలతో కలిసి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తన

సేవా కార్యక్రమాలకు అనుమతివ్వాలి
కార్యకర్తలతో కలిసి నిరసన దీక్ష చేపడుతున్న జీవీ

 మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

కార్యకర్తలతో కలిసి స్వగృహంలో దీక్ష

 

 వినుకొండ, మే 29: ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా శివశక్తి లీలా అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆపలేరని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. సేవా కార్యక్రమాలకు అధికారులు అనుమతించాలంటూ శనివారం ఆయన కార్యకర్తలతో కలిసి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తన స్వగృహంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పిలుపు మేరకు 1998నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ 23 ఏళ్లుగా ఈ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు. అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ముందు ఓట్లు దండుకునేందుకు తన సొంత భూమిలో కులానికి 5 ఎకరాలు ఇస్తానని చెప్పి గెలిచాక మోసం చేశారన్నారు. కేవలం రూ.4లక్షలు విలువ చేసే భూమిని రూ.18లక్షలకు ప్రభుత్వానికి అమ్మి కోట్లు దండుకొని అవే డబ్బుతో మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జి వద్ద 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేద ప్రజలను మోసం చేశారన్నారు. వెల్లటూరు రోడ్డులోని వీసీ నరసింహారెడ్డి భూవివాదంలో జోక్యం చేసుకొని బెదిరించి భూమిని సొంతం చేసుకున్నారని, మొత్తం 15 ఎకరాల్లో రూ.30 కోట్ల ఆస్తిని అప్పనంగా సొంతం చేసుకున్నారని ఆరోపించారు. గత సంవత్సరం తాము మునిసిపాలిటీకి మాస్కులు అందిస్తే వాటిని చెత్తకుండి పాలు చేయించిన నీచ చరిత్ర నీదన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం పోటీ పడ్డావని, సేవ చేస్తున్నానని గుర్తించి చంద్రబాబు నాయుడు టీడీపీ టిక్కెట్‌ తనకు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌, తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు సౌదాగర్‌ జానీబాషా, సీనియర్‌ నాయకుడు గన్నమనేని వెంకయ్య, న్యాయవాదులు పోట్లూరి సైదారావు, నలబోలు రామకోటేశ్వరరావు, సిద్ధయ్య, నాయకులు గద్దె వీరమస్తాన్‌రావు, పల్లమీసాల దాసయ్య, కోటేశ్వరరావు, బాలగురవయ్య,  బ్రహ్మయ్య,  విశ్వనాథం,  కాశీం, వెంకటకోటేశ్వరరావు, గోవిందునాయక్‌, వెంకటేశ్వర్లు,  వెంకటేశ్వరరెడ్డి,  కృష్ణారెడ్డి,  నాగేశ్వరరావు,  ప్రసాద్‌,  గంగయ్య,  జానీ తదితరులు పాల్గొన్నారు.   


========================

Updated Date - 2021-05-30T05:58:13+05:30 IST