విజ్ఞాన వర్సిటీలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-21T05:02:34+05:30 IST
స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో బుధవారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును ప్రారంభించినట్లు వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడించారు.

గుంటూరు(విద్య), అక్టోబరు 20: స్థానిక వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో బుధవారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును ప్రారంభించినట్లు వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వెల్లడించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆఽధ్వర్యంలో రూ.కోటి వ్యయంతో దీనిని ఏర్పాటు చేసిట్లు తెలిపారు. రోజు 7లక్షల లీటర్ల వ్యర్ధమైన నీటిని కనస్ట్రక్టెడ్ వెబ్‌ల్యాండ్ టెక్నాలజీతో తక్కువ విద్యుత వినియోగించి శుద్ధి చేస్తామని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు కార్యక్రమంలో విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్ లావు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.