విజ్ఞాన.. పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-08-28T04:20:18+05:30 IST

చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన యూరివర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది.

విజ్ఞాన.. పట్టాభిషేకం
సోనంవాంగ్‌చుక్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న యూజీసీ చైర్మన డాక్టర్‌ డీపీ సింగ్‌, పాల్గొన్న విజ్ఞాన విద్యాసంస్థల అధినేత లావురత్తయ్య తదితరులు

అట్టహాసంగా విజ్ఞాన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ఇద్దరికి గౌరవ డాక్టరేట్స్‌ ప్రదానం..

48 మందికి బంగారు పతకాలు, 1866 మందికి డిగ్రీల పట్టా..

నూతన విద్యావిధానం శుభపరిణామం

ఢిల్లీ యూజీసీ చైర్మన డాక్టర్‌ డీపీ సింగ్‌

సవాళ్లును ఎదుర్నొనే నైపుణ్యం అవసరం: లావు రత్తయ్య

 గుంటూరు(తూర్పు), ఆగస్టు 27: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన యూరివర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఇద్దరికి గౌరవ డాక్టరేట్స్‌, 48 మందికి బంగారు పతకాలు, 1,866 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కార్యక్రమం ఆద్యంతం సంబరంగా సాగింది. డిగ్రీ పట్టాను అందుకున్న విద్యార్థులు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఢిల్లీ యూజీసీ చైర్మన డాక్టర్‌ డీపీ సింగ్‌ మాట్లాడుతూ విద్యార్థులు కొలువ్చుటచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సృజనాత్మకత, వినూత్న ఆలోచనల ద్వారా సొంత మార్గం ఏర్పడుతుందన్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత నూతన జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని అన్నారు. దీంతో నాణ్యత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. గౌరవఅతిఽథిగా పాల్గొన్న చెన్నైలోని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా యంగ్‌ సీవ్‌క్వాన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు. విజ్ఞాన విద్యాసంస్థల అధినేత లావురత్తయ్య మాట్లాడుతూ గత రెండు దశాబ్దాల నుంచి సాధించిన పురోగతి, అంతకు ముందు 200 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధితో సమానమని అన్నారు. కొవిడ్‌ మహమ్మారి ఎంత బాధపెట్టినా సెల్ఫ్‌ లెర్నింగ్‌ నేర్పిందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం అవసరమన్నారు. విజ్ఞాన సంస్థల వైస్‌ చైర్మన లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాక్షించారు. విజ్ఞాన యూనివర్సీటీ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ లడక్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ సోనం వాంగ్‌చుక్‌, కీటోజెనిక్‌ డైటీషీయన ఎక్స్‌పర్ట్‌ వీరమాచినేని రామకృష్ణ మాట్లాడుతూ యువతలో ఉన్న అపార అనుభవాలను దేశాభివృద్ధికి వాడుకోవాలని సూచించారు. వీసీ ఎంవైఎస్‌ ప్రసాదు, ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.రామ్మూర్తినాయుడు, రిజిసా్ట్రర్‌ ఎంఎస్‌ రఘనాథన, స్నాతకోత్సవం ప్రధాన కన్వీనర్‌ డి.విజయకృష్ణ, కో కన్వీనర్‌ ఎల్‌.సువర్ణరాజు, ఆయా విభాగాల డీన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

  

Updated Date - 2021-08-28T04:20:18+05:30 IST