వైభవంగా దశావతారుని కల్యాణం

ABN , First Publish Date - 2021-12-09T05:39:55+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద గల దశావతార వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి కల్యాణోత్యవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా దశావతారుని కల్యాణం
దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణం

పెదకాకాని, డిసెంబరు 8: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద గల దశావతార వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి కల్యాణోత్యవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి వారి కల్యాణం, హోమాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లింగమనేని పూర్ణ భాస్కరరావు మాట్లాడుతూ  ధనుర్మాసం  ఈ నెల 16 నుంచి ప్రారంభం సందర్భంగా తిరుప్పావై పారాయణం విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. 

 

Updated Date - 2021-12-09T05:39:55+05:30 IST