వైద్యుల సేవలు వెలకట్టలేనివి
ABN , First Publish Date - 2021-07-24T05:46:16+05:30 IST
కొవిడ్ సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ తులసి ధర్మచరణ్ పేర్కొన్నారు.

వేద సీడ్స్ ఈడీ తులసీ ధర్మచరణ్
గుంటూరు, జూలై 23: కొవిడ్ సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ తులసి ధర్మచరణ్ పేర్కొన్నారు. కరోనా ఉధృతి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందించిన డాక్టర్ చిట్టెంలక్ష్మణ్, డాక్టర్ కంఠా జగదీష్, డాక్టర్ సీహెచ్ విజయరామకృష్ణారెడ్డి, డాక్టర్ మేరుగ చందన్, డాక్టర్ విడదల కృష్ణశాంత్, వైద్య సిబ్బంది కడారి గణేష్, పుల్లగూర చంద్రశేఖర్‌లను అరండల్‌పేట 11/3లోని వేద సీడ్స్ కార్యాలయంలో శుక్రవారం ధర్మచరణ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద సీడ్స్ సహకారంతో డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ గురజాల డివిజన్ ప్రజలు వైద్య అవసరాలకు గుంటూరు వచ్చేందుకు ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో వేద సీడ్స్ హెచ్‌ఆర్ మేనేజర్ తోట రంగారావు, డీజీఎం నీలం శివరామకృష్ణ, ఇక్కుర్తి వెంకటేష్, గాజుల సాయిరామ్ తదితరులున్నారు.