భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

ABN , First Publish Date - 2021-08-21T05:49:48+05:30 IST

శ్రావణమాస రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన ఆలయాల్లో, గృహాలలో వరలక్ష్మీ వ్రతాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
అరండల్‌పేట అష్టలక్ష్మీ ఆలయంలో పూజ చేస్తున్న అర్చకుడు

గుంటూరు(సాంస్కృతికం), ఆగస్టు 20: శ్రావణమాస రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన ఆలయాల్లో, గృహాలలో వరలక్ష్మీ వ్రతాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకరణ జరిగాయి. నగరంలోని బృందావన గార్డెన్స వెంకటేశ్వరస్వామి ఆలయం, అరండల్‌పేట అష్టలక్ష్మీ ఆలయం, ఆర్‌ అగ్రహారం కన్యకా పరమేశ్వరి దేవాలయం, సంపతనగర్‌ శ్రీ శారదాపరమేశ్వరి ఆలయం, మల్లారెడ్డినగర్‌ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం తదితర ఆలయాలలో వరలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 
Updated Date - 2021-08-21T05:49:48+05:30 IST