గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

ABN , First Publish Date - 2021-05-14T05:14:51+05:30 IST

మండల పరిధిలోని చిలుమూరు గ్రామానికి చెందిన శ్రీరామ్‌ ఇమ్మానుయేలు(31) అనే ఉపాధి కూలీ గుండెపోటుతో గురువారం మృతి చెందినట్లు తోటి కూలీలు తెలిపారు.

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

కొల్లూరు, మే 13: మండల పరిధిలోని చిలుమూరు గ్రామానికి చెందిన శ్రీరామ్‌ ఇమ్మానుయేలు(31) అనే  ఉపాధి కూలీ గుండెపోటుతో గురువారం మృతి చెందినట్లు తోటి కూలీలు తెలిపారు.  ఇమ్మానుయేలు తోటి కూలీలతో కలిసి గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గమనించిన కూలీలు గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం తెనాలిలోని వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఉపాధి కూలీ మృతి చెందిన సమాచారం అధికారులకు తెలిసినా వారి నుంచి స్పందన లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.


Updated Date - 2021-05-14T05:14:51+05:30 IST