టీడీపీ విష ప్రచారం చేసినా ప్రజలు వైసీపీ వెంటే

ABN , First Publish Date - 2021-02-11T05:38:06+05:30 IST

వైసీపీ పాలనపై టీడీపీ విష ప్రచారం చేసినా ప్రజలు జగన్‌ వెంటే ఉన్నారని పంచాయతీ ఎన్నికలు నిరూపించాయని శాసన మండలి చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

టీడీపీ విష ప్రచారం చేసినా ప్రజలు వైసీపీ వెంటే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రోశయ్య

శాసన మండలి చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

గుంటూరు, ఫిబ్రవరి 10: వైసీపీ పాలనపై  టీడీపీ విష ప్రచారం చేసినా ప్రజలు జగన్‌ వెంటే ఉన్నారని పంచాయతీ ఎన్నికలు నిరూపించాయని శాసన మండలి చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీకి కనువిప్పు కావాలన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీకి 18 నుంచి 20 శాతం ఫలితాలు వస్తే చంద్రబాబు 38.74 శాతం ఫలితాలు వచ్చాయని చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. అబద్ధాలతో సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మిగతా మూడు దశల ఎన్నికల్లోనూ వైసీపీకి ఇవే ఫలితాలు రిపీట్‌ అవుతాయన్నారు. ఫలితాలు చూశాక టీడీపీ నేతలకు నోట మాటరావడం లేదన్నారు. 


Updated Date - 2021-02-11T05:38:06+05:30 IST