చిన్నారుల కుటుంబాలకు రెండెకరాల పొలం

ABN , First Publish Date - 2021-08-20T14:16:47+05:30 IST

మండలంలోని శ్రీనివాసపురం మైనింగ్‌ క్వారీ నీళ్లలో..

చిన్నారుల కుటుంబాలకు రెండెకరాల పొలం

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వెల్లడి


దాచేపల్లి: మండలంలోని శ్రీనివాసపురం మైనింగ్‌ క్వారీ నీళ్లలో పడి చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రెండెకరాల పొలం ఇస్తున్నామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామానికి చేరుకున్న ఆయన ఇటీవల మృతిచెందిన బొజ్జ మన్నెయ్య, కనకం మాధవ్‌ల తల్లిదండ్రులను పరామర్శించి జరిగిన ఘటనపై సానుభూతి వ్యక్తంచేశారు. జరిగిన నష్టం పూడ్చలేనిదని, పార్టీ, ప్రభుత్వపరంగా అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే కాసు బాధిత కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.బాధిత కుటుంబసభ్యులకు చెరొక రెండెకరాలు మంజూరుచేయాల్సిందిగా ఎమ్మెల్యే కాసు తహసీల్దారుకు సూచన చేశారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్య లను తీసుకువచ్చారు. గ్రామంలో రహదారులు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, మరికొన్ని ఇతర సమస్యలను ప్రస్తావించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయనవెంట ఏవీ కోట కృష్ణ, అంబటి శేషగిరిరావు, కటకం బ్రహ్మనాయుడు తదితరులున్నారు. 


Updated Date - 2021-08-20T14:16:47+05:30 IST