మహానేత వైఎస్సార్‌కి నివాళి

ABN , First Publish Date - 2021-09-03T14:37:14+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమ పాలన చేసి..

మహానేత వైఎస్సార్‌కి నివాళి

తెనాలి రూరల్‌: రాష్ట్రంలో సంక్షేమ పాలన చేసి ప్రజల మనస్సులో చెరగని స్థానం సంపాదించిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. గురువారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతిని పట్టణ, గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో, రణరంగచౌక్‌ వద్ద మండలంలోని కఠెవరం, కోపల్లె, గుడివాడ, కొలకలూరు తదితర గ్రామాల్లో పలువురు నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన వర్ధంతి సభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సీఎంగా రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రైల్వేస్టేషన్‌ వర్ధంతి వైసీపీ నామకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అందిం చి పలు సేవాకార్యక్రమాలకు హాజరయ్యారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఖాలేదానసీమ, వైస్‌ చైర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌, గుంటూరు కోటేశ్వరావు, మండల పార్టీ నాయకులు చెన్నుబోయిన శ్రీనివాసరావు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కొల్లిపర మండలంలో..

కొల్లిపర: మండలంలోని తూములూరులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభకు సొసైటీ అధ్యక్షుడు ఈమని హరికోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కొల్లిపరలో వైఎస్పార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు బాణావత్‌ అరుణాబాయ్‌, పిల్లి రాధిక, ఉపసర్పంచులు అవుతు కృష్ణారెడ్డి, మర్రెడ్డి బ్రహ్మరెడ్డి, అవుతు పోతురెడ్డి, వైసీపీ కన్వీనర్‌ ఆరిగ చంద్రశేఖర్‌రెడ్డి, తెనాలి మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్‌ జొన్నల శివారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్‌: రాజ్యసభ సభ్యుడు మోపిదేవి రమణారావు

రేపల్లె: మహనేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నియోజకవర్గంలో వాడవాడలా నివాళులు అర్పించారు. నియోజక వర్గంలో వైఎస్సార్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాం జలి ఘటించారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలోని స్థానిక బస్టాండ్‌ లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనం తరం ఆయన మాట్లాడు తూ అభివృద్ధి సంక్షేమ పాలన ప్రజలకు అందించిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. నిరంతరం పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారని కొనియా డారు. కార్యక్రమంలో వైసీపీ రూరల్‌ కన్వీనర్‌ గడ్డం రాధా కృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కట్టా మంగ, వైస్‌ చైర్మన్‌ తూనుగుంట కాళీవిశ్వనాధగుప్తా, గుజ్జర్లమూడి ప్రశాంత కుమార్‌, పట్టణ మహిళా కన్వీనర్‌ కొత్తపల్లి శ్రీవాణి, మైనారిటీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ మహ బూబ్‌ సుబానీ, పట్టణ కన్వీనర్‌ చిత్రల ఒబేదు, తదితరులు పాల్గొన్నారు. అక్షయపాత్ర సంస్ధ అందజేసిన నిత్యావసర సరుకులను వైసీపీ కార్యాలయంలో పేదలకు పంపిణీ చేశారు. 


వేమూరు మండలంలో..

వేమూరు: మరువలేని మహానేత, అపర భగీరథుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి వర్ధంతి పురస్కరించుకుని మండల పరిధి గ్రామాల్లో గురువారం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వ హించారు. వేమూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బస్టాండ్‌ సెంటర్లలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఏడుకొండలు, వైసీపీ నాయకులు డేవిడ్‌ విజయ్‌కుమార్‌, లవకుమార్‌, గాజుల భాను, సజ్జా వాసు, తాళ్లూరి శ్రీనివాసరావు, రమేష్‌బాబు, జిగిన్‌బాబు, మేరీసుబాబు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


భట్టిప్రోలు మండలంలో..

భట్టిప్రోలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని మండలంలోని వైసీపీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వేగేటు వద్ద గల వైఎస్‌ విగ్రహానికి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దేపల్లి, ఐలవరం, భట్టిప్రోలు, వెల్లటూరు, పెదపులివర్రు, కోళ్లపాలెం గ్రామాలతో పాటుగా ఆయా గ్రామాల్లో వైఎస్సార్‌ విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దారా రవికిరణ్మయి చెన్నయ్య, ఉప సర్పంచ్‌ బూర్లె రాంప్రసాద్‌, వైసీపీ నాయకులు పడమట శ్రీనివాసరావు, చినబుజ్జి తదితరులు పాల్గొన్నారు.


చుండూరు మండలంలో..

చుండూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మం డూరు, చుండూరు, వలివేరు, చినపరిమి, మోదుకూరు, మున్నంగివారిపాలెం, యడ్లపల్లి, వేటపాలెంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ పాలనా కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్థి సాధించిందని వక్తలు కొనియాడారు. 


కొల్లూరు మండలంలో..

కొల్లూరు: కొల్లూరులోని వైఎస్‌ విగ్రహానికి, చిత్రపటానికి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వేమూరు ఎఎంసీ చైర్మన్‌ బొల్లిముంత ఏడుకొండలు, పార్టీ నాయకులు నర్రా అప్పారావు, బిట్రగుంట సత్యనారాయణ, ఘంటా శివరంగారావు, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చొప్పర సుబ్బారావు, మోషే, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 


అమృతలూరు మండలంలో..

అమృతలూరు: మండల పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అమృతలూరులోని వైఎస్‌ఆర్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు వైఎస్సార్‌ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాపర్ల నరేంద్రకుమార్‌, యల వర్తి సురేష్‌బాబు, చదలవాడ రమేష్‌, సర్పంచ్‌ దేవరకొండ రాము, కొండమూది భాస్కరరావు, అంబటి రామ్మోహనరావు, కోళ్లపూడి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T14:37:14+05:30 IST