విద్యుత్‌ శాఖలో.. బదిలీలలు!

ABN , First Publish Date - 2021-03-21T05:37:33+05:30 IST

విద్యుత్‌ శాఖలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజ నీర్‌ (ఈఈ)ల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏపీసీపీ డీసీఎల్‌ సీఎండీ పద్మజనార్ధన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం గుంటూరు టౌన్‌-1, నరసరావుపేట, మాచర్ల ఈఈలను బదిలీ చేశారు.

విద్యుత్‌ శాఖలో.. బదిలీలలు!

ఉదయం బదిలీ ఉత్తర్వులు.. మధ్యాహ్నానికి బాధ్యతలు..

గంటల వ్యవధిలోనే రద్దు.. తిరిగి మాతృస్థానానికి బదిలీ

రాజకీయ ఒత్తిళ్లే కారణం!


గుంటూరు, మార్చి 20: విద్యుత్‌ శాఖలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజ నీర్‌ (ఈఈ)ల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏపీసీపీ డీసీఎల్‌ సీఎండీ పద్మజనార్ధన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం గుంటూరు టౌన్‌-1, నరసరావుపేట, మాచర్ల ఈఈలను బదిలీ చేశారు. కాగా మధ్యాహ్నానికే బదిలీలను రద్దు చేయటం చర్చకు దారి తీసింది. బదిలీలు ఎందుకు చేసినట్టు.. ఎందుకు రద్దు చేసి నట్టు అంటూ ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గుం టూరు టౌన్‌-1 ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)గా వ్యవహరిస్తున్న జె.హరిబాబును గుం టూరు సర్కిల్‌ టెక్నికల్‌ ఈఈగా బదిలీ చేశారు. శనివారం సాయంత్రాని కి ఆయన బదిలీ రద్దు చేయటంతో తిరిగి గుంటూరు టౌన్‌-1 ఈఈగా బాధ్యతలు స్వీకరించారు. అలానే నరస రావుపేట ఈఈగా పనిచేస్తున్న టి.శ్రీనివాసబాబును గుంటూరు టౌన్‌-1 ఈఈగా నియమించగా ఉద యం బాధ్యతలు స్వీకరించారు. బదిలీ రద్దు చేయటంతో తిరిగి మాతృ స్థానమైన నరసరావుపేట సర్కిల్‌లో యథాస్థానానికి వెళ్ళారు. గుంటూ రు టెక్నికల్‌ ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును విజయ వాడలోని లోడ్‌ మానిటరింగ్‌ విభాగానికి బదిలీ చేయగా, గుంటూరు-2 ఈఈ శ్రీనివాసరెడ్డిని గుంటూరు ఈఈగా బదిలీ చేశారు. అలానే మాచర్ల ఈఈగా పనిచేస్తున్న ఆనంద్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను విజయవాడలోని కన్‌స్ట్రక్షన్‌ విభాగానికి బదిలీ చేయగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉత్తర్వులు రద్దుచేయటంతో తిరిగి మాచర్ల ఈఈగా యఽథా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. బదిలీల వ్యవహారంపై విద్యుత్‌ శాఖవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ల బదిలీలు, రద్దు వ్యవహారంపై రాజకీయ వత్తిళ్లే కారణమన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ఎక్కడో ఒకటి జరిగేదని, ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఈఈల బదిలీలు వ్యవహారం ఉదయం నుంచి సాయంత్రానికి మారిపోవటం ఆశాఖ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కొందరు ఈఈల రాజకీయ పలుకుబడి కూడా పనిచేసిందని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. 

Updated Date - 2021-03-21T05:37:33+05:30 IST