గుంటూరు మీదగా ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2021-10-30T04:48:00+05:30 IST

ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు గుంటూరు మీదగా నెలపాటు వారంలో మూడు రోజులు మచిలీపట్నం - కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

గుంటూరు మీదగా ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు గుంటూరు మీదగా నెలపాటు వారంలో మూడు రోజులు మచిలీపట్నం - కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు. 07237 మచిలీపట్నం - కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.25కి గుంటూరు, వేకువజామున 5.10కి కర్నూలు సిటీ చేరుకొంటుంది. నెంబరు.07238 కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7వ తేదీ నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు ప్రతీ బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి 10.25కి నంద్యాల, ఉదయం 7.05కి మచిలీపట్నం చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌-1, ఏసీ త్రీటైర్‌-1, స్లీపర్‌క్లాస్‌-7, సెకండ్‌ సిట్టింగ్‌-4, బ్రేక్‌ వ్యాన్‌-2 బోగీలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు. 


Updated Date - 2021-10-30T04:48:00+05:30 IST