పొగాకు బోర్డు వైస్‌చైర్మనగా వాసుదేవరావు
ABN , First Publish Date - 2021-08-17T05:42:12+05:30 IST
పొగాకు బోర్డు వైస్ చైర్మనగా వాసుదేవరావును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశాన్ని చైర్మన యడ్లపాటి రఘనాథబాబు అధ్యక్షతన జూమ్‌లో నిర్వహించారు.
గుంటూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పొగాకు బోర్డు వైస్ చైర్మనగా వాసుదేవరావును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశాన్ని చైర్మన యడ్లపాటి రఘనాథబాబు అధ్యక్షతన జూమ్‌లో నిర్వహించారు. రాష్ట్రంలో 2021-22కు పంట ఉత్పత్తి లక్ష్యాన్ని 130 మిలియన కిలోలుగా ఖరారు చేశారు. జూమ్ సమావేశంలో ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, పాలకవర్గ సభ్యులు పోలిశెట్టి శ్యామ్‌సుందర్, యార్లగడ్డ అంకమ్మచౌదరి, కె.వాసుదేవరావు, కొండారెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఇండియన టుబాకో అసోసియేషన అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసుదేవరావును పాలకవర్గ సబ్యులు, అధికారులు అభినందించారు.