బంగారం షాపులో చోరీ

ABN , First Publish Date - 2021-10-29T05:16:20+05:30 IST

పట్టణంలోని రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని అనూష్క బంగారం షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.

బంగారం షాపులో చోరీ
సంఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ విజయభాస్కర్‌, సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రాజ్యలక్ష్మి

రూ.25 లక్షలు ఆభరణాల అపహరణ  

వినుకొండ టౌన్‌, అక్టోబరు 28:  పట్టణంలోని రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని అనూష్క బంగారం షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుకాణంపై భాగంలోని రేకులను లోనికి వచ్చిన వారు 30 కేజీల వెండి, 200 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు షాపు యజమాని టీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌, పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. డీఎస్పీ వెంట పట్టణ ఇన్‌చార్జి సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రాజ్యలక్ష్మి, ఏఎస్‌ఐ సాంబయ్య, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-10-29T05:16:20+05:30 IST