తల్లి కడచూపునకు వచ్చేలోగా.. తండ్రీ దూరం!

ABN , First Publish Date - 2021-05-30T06:13:04+05:30 IST

కరోనాతో చికిత్స పొందుతూ తల్లి మరణించిందని తెలిసి ఆమె కడసారి చూపుకోసం కెనడా నుంచి కుమారులు వచ్చారు. అదేరోజు తండ్రా కూడా మరణించాడు

తల్లి కడచూపునకు వచ్చేలోగా.. తండ్రీ దూరం!
అంత్యక్రియలు చేస్తున్న సత్యం శివం సుందరం సేవా బృందం

  కెనడా నుంచి వచ్చిన కుమారులు

ఈలోగా తండ్రీ మృతి

 ఓ కుటుంబంలో కరోనా నింపిన విషాదం


 తెనాలి, మే 29, (ఆంధ్రజ్యోతి): కరోనాతో చికిత్స పొందుతూ తల్లి మరణించిందని తెలిసి ఆమె కడసారి చూపుకోసం కెనడా నుంచి కుమారులు వచ్చారు. అదేరోజు తండ్రా కూడా మరణించాడు. ఈ విషాద ఘటన తెనాలిలో జరిగింది. స్థానిక నాజరు పేటకు చెందిన బొబ్బిలి అప్పారావు, విజయలకు కరోనా లక్షనాలతో మూడు వారాల నుంచి విజయవాడలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఐదురోజుల క్రితం విజయ మరణించారు. ఆమె మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. కడచూపు కోసం కుమారులు శనివారం కెనడా నుంచి విజయవాడకు వచ్చారు. అప్పటికే పుట్టెడు దుఃఖంతో ఉన్నవారికి మరో పిడుగులాంటి వార్త ఎదురయింది. చికిత్స పొందుతున్న తండ్రికూడా శనివారమే మరణించాడు. ఇద్దరి మృతదేహాలను విజయవాడ నుంచి తెనాలి తీసుకువచ్చి, శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. సత్యం, శివం, సుందరం సామాజిక సేవా కేంద్రం సభ్యులు భార్యభర్తలిద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు. సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్‌, సభ్యులు మాలేపాటి హేమ్‌కుమార్‌, షేక్‌ షఫీ, పసుపులేటి అమర్‌, ఎన్‌.రంగనాద్‌, గాలి శివకుమార్‌, రాజశేఖర్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.      

Updated Date - 2021-05-30T06:13:04+05:30 IST