రూ. 11 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-02-26T05:48:24+05:30 IST
నకరికల్లులోని ఏకలవ్య విగ్రహం వద్ద సీఐ కసుకుర్తి కర్ణ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున రూ.11 లక్షల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

నరసరావుపేట లీగల్, ఫిబ్రవరి 25: నకరికల్లులోని ఏకలవ్య విగ్రహం వద్ద సీఐ కసుకుర్తి కర్ణ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున రూ.11 లక్షల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. మద్యాన్ని తెలంగాణ నుంచి తెచ్చి చిలకలూరిపేటలో బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్టు విచారణలో నిందితులు తెలిపారన్నారు. ఈ కేసులో మొత్తం 14 మందికి సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం చిలకలూరిపేటకు చెందిన బాణావత్ దుర్గానాయక్, పురుషోత్తపట్నంకు చెందిన షేక్ నూర్‌అహమ్మద్, అన్నపురెడ్డి శ్రీనివాసరావు, షేక్ జానీబాషా, నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన కిష్టం నాగరాజు, గుంటూరుకు చెందిన గుడిపోగు రత్నంరాజులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఐశ్చర్, మహీంద్ర బొలేరో వాహనాలతో పాటు రెండు బైక్‌లు, ఓ ఆటో, 4686 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.