1098 మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-22T06:30:44+05:30 IST

మండలంలోని పొనుగోటివారిపాలెంలో సోమవారం పోలీసులు దాడులు చేసి రూ.3లక్షల విలువ చేసే 1098 మద్యం సీసాలను పట్టుకున్నారు.

1098 మద్యం సీసాలు స్వాధీనం
పోలీసులు స్వాదీనం చేసుకున్న తెలంగాణ మద్యం సీసాలు

ఈపూరు, జూన్‌ 21: మండలంలోని పొనుగోటివారిపాలెంలో సోమవారం పోలీసులు దాడులు చేసి రూ.3లక్షల విలువ చేసే 1098 మద్యం సీసాలను పట్టుకున్నారు. గ్రామానికి చెందిన పొనుగోటి శ్రీనివాసరావు తెలంగాణ మద్యాన్ని తీసుకొని మోటార్‌ బైక్‌పై వెళ్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావును విచారించగా గ్రామానికి ఆనుకొని ఉన్న దొడ్లలో దాచి ఉన్నట్లు చెప్పడంతో వినుకొండ రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ వెంకట్రావు, ట్రైనీ ఎస్‌ఐ నవీన్‌లు ఆక్రమంగా దాచి ఉంచిన మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. 


Updated Date - 2021-06-22T06:30:44+05:30 IST