వృద్ధుల సేవ సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2021-06-21T06:41:22+05:30 IST

వృద్ధుల సేవ సామాజిక బాధ్యతగా గుర్తించాలని టెక్నాలజీ సర్వీస్‌ జనరల్‌ మేనేజర్‌ డి.వెంకటాచలం పేర్కొన్నారు.

వృద్ధుల సేవ సామాజిక బాధ్యత
అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న వెంకటాచలం తదితరులు

గుంటూరు, జూన్‌ 20: వృద్ధుల సేవ సామాజిక బాధ్యతగా గుర్తించాలని టెక్నాలజీ సర్వీస్‌ జనరల్‌ మేనేజర్‌ డి.వెంకటాచలం పేర్కొన్నారు. పాతగుంటూరు యాదవుల బజార్‌ ఆర్‌ఆర్‌ మూర్తి వృద్ధుల సేవాసంస్థ వారి ఉచిత అంబులెన్స్‌ సర్వీసును ఆదివారం వెంకటాచలం దంపుతులు లాంఛనంగా ప్రారంభించారు. అనిత మాట్లాడుతూ వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులు రామమూర్తి, ప్రసూనదేవి దంపతుల సేవలను ప్రశంసించారు.  కార్యక్రమంలో ఆడిటర్‌ కాకాని సురేష్‌, సేవా సంస్థ మేనేజర్‌ లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గొట్టిముక్కల కళ్యాణి, రాయవరపు గాయత్రి, ఆనంద్‌చౌదరి, గోపిబాబు తదితరులున్నారు. 

 

Updated Date - 2021-06-21T06:41:22+05:30 IST