ప్రశాంతంగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-10-30T04:43:11+05:30 IST
ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.
గుంటూరు(విద్య), అక్టోబరు 29: ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 7, ఇంగ్లీషు 18, బయలాజికల్ సైన్స 31, ఫిజికల్ సైన్స 6, గణితం 14 పోస్టులకు ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచఎంలకు ఉద్యోగోన్నతి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు షేక్ సంధాని, కె.నారాయణరావు, సీనియర్ ఉపాధ్యాయులు ఎస్‌వీఆర్ ప్రసాద్, వై.శ్రీనివాసరావు, ఎస్‌కే ఎండీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.