ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 13,130

ABN , First Publish Date - 2021-02-05T05:50:06+05:30 IST

కృష్ణ - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 13,130

గుంటూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణ - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఓటర్‌ జాబితాలను ప్రదర్శించనున్నట్లు ఎలక్టోరల్‌ అధికారి సీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో పురుషులు 3,566, మహిళలు 2,741 మంది, ట్రాన్స్‌జెండర్‌ ఒకరు కలిపి మొత్తం 6,308 మంది ఓటుహక్కు పొందారు. గుంటూరు జిల్లాలో పురుషులు 4,259, మహిళలు 2,563 మంది కలిపి మొత్తం 6,822 మంది ఓటుహక్కు పొందారు. రెండు జిల్లాలు కలిపి 13,130 మంది ఓటుహక్కు పొందారు.   గత ఎన్నికలతో పోల్చితే ఈ దఫా ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. క్రితంసారి జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 17 వేల మందికి పైగా ఓటర్లుండగా ఈ దఫా ఇంచుమించు నాలుగు వేల మంది తగ్గిపోయారు. 

 

Updated Date - 2021-02-05T05:50:06+05:30 IST