మెట్టభూమిని కొట్టేసే భారీ స్కాం

ABN , First Publish Date - 2021-10-19T05:45:36+05:30 IST

రాజధానిలో నదీపాతం భూములను కూడా వైసీపీ ప్రజాప్రతినిఽధులు వదలటం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష పేర్కొన్నారు.

మెట్టభూమిని  కొట్టేసే భారీ స్కాం
అమరావతి భూములు రక్షించాలంటూ నినాదాలు చేస్తున్న దళిత, యువజన, మైనార్టీ జేఏసీ సభ్యులు, శిరీష

తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి శిరీష

తుళ్లూరు, అక్టోబరు 18: రాజధానిలో నదీపాతం భూములను కూడా వైసీపీ ప్రజాప్రతినిఽధులు వదలటం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష పేర్కొన్నారు. సోమవారం రాయపూడి  కృష్ణానది  వద్ద ప్ల కార్డులు పట్టుకొని  రాజధాని రైతులు, దళిత, యువజన, మైనార్టీ జేఏసీ సభ్యులు ఆందోళన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో శిరీష మాట్లాడుతూ, నదీపాతం భూములను మెట్టగా మార్చి రిజస్ర్టేషన్‌ అయ్యేవిధంగా అధికారులను అడ్డంపెట్టి, హక్కు గల రైతులను మభ్యపెట్టి వైసీపీ ప్రజాప్రతినిధులు భారీస్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. దళిత రైతుల లంకభూముల సర్వే నెంబర్లతో నదీ పాతం భూమిని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై తగుచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. నదీపాతం భూములపై  హక్కు రైతులకు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాని రిజిసే్ట్రషన్‌లు జరగవన్నారు. దానిని మెట్టగా చిత్రీకరించి రిజిసే్ట్రషన్‌లు జరిగే విధంగా వైసీపీ ప్రజాపత్రినిధులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. దీనిలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో యాభై ఎకరాల నదీపాతం భూములకు రెక్కలు వచ్చాయని రాజధాని ముస్లిం మైనార్టీ జేఏసీ సభ్యుడు షేక్‌ జానీబాషా, దళిత జేఏసీ యువజన సభ్యుడు మేకల అనిల్‌ ఆరోపించారు. ‘సేవ్‌ అమరావతి ల్యాండ్స్‌, ఒకేరాష్ట్రం ఒకే రాజధాని అమరావతి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని శిరీష ఆధ్వర్యంలో  ఆందోళనలు నిర్వహించారు. 

 

Updated Date - 2021-10-19T05:45:36+05:30 IST