ఆడపిల్లలపై అరాచకాలకు కేరాఫ్‌గా ఏపీ

ABN , First Publish Date - 2021-08-21T05:48:39+05:30 IST

ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జ్‌ మహ్మద్‌ నసీర్‌ అన్నారు.

ఆడపిల్లలపై అరాచకాలకు కేరాఫ్‌గా ఏపీ
కొవ్వొత్తుల ర్యాలీనిర్వహిస్తున్న టీడీపీ నేతలు నసీర్‌, చిట్టిబాబు తదితరులు

టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

గుంటూరు, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇనచార్జ్‌ మహ్మద్‌ నసీర్‌ అన్నారు. వరుసగా రాష్ట్రంలో ఆడపిల్లలపై చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలను నిరసిస్తూ శుక్రవారం నగరంలో ఏటుకూరు రోడ్డు మూడుబొమ్మల సెంటర్‌లోని మార్కెట్‌సెంటర్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ గుంటూరులో కత్తివేటుకు మొన్న రమ్యను నేలకొరికితే నిన్న రాజుపాలెంలో చిన్నారి పశువాంఛలకు బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్మాద చర్యలు పెరిగిపోవడానికి సీఎం జగన చేతగాని తనమే కారణమన్నారు. కాగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుచెప్పడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  గుంపుగా కాకుండా ఇద్దరిద్దరు చొప్పున ర్యాలీకి అనుమతించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, నేతలు యరమాల కిరణ్‌, జాగర్లమూడి శ్రీనివాస్‌, గోళ్ళ ప్రభాకర్‌, యల్లావుల అశోక్‌యాదవ్‌, గుడిపల్లి వాణి, సాధినేని శ్రీనివాసరావు, బ్రహ్మసాని శ్రీనివాసరావుతో పాటు అన్ని డివిజనల అఽధ్యక్షులు, ఇతన నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-21T05:48:39+05:30 IST