వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదు: గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2021-02-01T23:05:06+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు

వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదు: గల్లా జయదేవ్‌

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి నిరాశే మిగిలిందన్నారు. కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో అనేక రంగాలు పుంజుకున్నాయని, మరికొన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తెచ్చాం.. కానీ ఈసారి వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు.

Updated Date - 2021-02-01T23:05:06+05:30 IST