అనుబంధ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-01-20T05:35:22+05:30 IST

తెలుగుదేశంపార్టీ అనుబంధకమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.

అనుబంధ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలి
టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమైన ఏలూరి సాంబశివరావు

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు 

బాపట్ల, జనవరి 19: తెలుగుదేశంపార్టీ అనుబంధకమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఇసుక దర్శిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనాయకులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీభవిష్యత్తు కార్యాచరణ, అనుబంధకమిటీల ఏర్పాటు, ప్రజల కోసం పార్టీ చేయబోతున్న పోరాటాలపై చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీని బలోపేతం చేయటంలో సైనికునివలే పనిచేయాలని చెప్పారు. సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, సంతనూతలపాడు ఇన్‌చార్జ్‌ బి.ఎన్‌.విజయ్‌కుమార్‌, చీరాల ఇన్‌చార్జి యడం బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాతా జయప్రకాష్‌ నారాయణ, రాష్ట్రకార్యదర్శి దాసరి ఉషారాణి, పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళా కార్యదర్శి పల్లం సరోజని, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కుర్రా ధనేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T05:35:22+05:30 IST