శివశ్రీ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ

ABN , First Publish Date - 2021-08-26T04:42:28+05:30 IST

నుమానాస్పద స్థితిలో మృతిచెందిన మాజీ వలంటీర్‌ శివశ్రీ సోదరుడు అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని మంగళవారం అర్థరాత్రి సమయంలో వారు నివసిస్తున్న కుంచనపల్లి ప్రాంతానికి తీసుకు వచ్చారు.

శివశ్రీ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ
శివశ్రీ కుటుంబీకులను పరామర్శిస్తున్న టీడీపీ నేతలు పోతినేని, గంజి

తాడేపల్లి, ఆగస్టు 25: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మాజీ వలంటీర్‌ శివశ్రీ సోదరుడు అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని మంగళవారం అర్థరాత్రి సమయంలో వారు నివసిస్తున్న కుంచనపల్లి ప్రాంతానికి తీసుకు వచ్చారు. శివశ్రీ తన సోదరుని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా అనిల్‌కుమార్‌ మృతదేహానికి బుధవారం మంగళగిరిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పజెప్పారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్‌, జంగాల సాంబశివారావు తదితరులు అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగకుండా ఆ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఓలేటి రాము, సూరగాని కిరణ్‌, ఢిల్లీ రామారావు, లీలాకృష్ణ అద్దంకి మురళి, ఇట్టా భాస్కర్‌, సలాం, నాగుల్‌మీరా, శైలజ, కుసుమ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-26T04:42:28+05:30 IST