రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం: Yarapatineni

ABN , First Publish Date - 2021-12-08T16:29:47+05:30 IST

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.

రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం: Yarapatineni

గుంటూరు: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పిడుగురాళ్ల లో  రోశయ్య కాంస్య విగ్రహాన్ని  ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే మార్చి నాటికల్లా పిడుగురాళ్లలో రోశయ్య విగ్రహం పెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ తరుపున తామే కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ విలువలు కలిగిన నేత రోశయ్య అని అన్నారు. రోశయ్య జీవితం బావి తరాలకు ఆదర్శం కావాలని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-08T16:29:47+05:30 IST